స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల కొరతను అధిగమించేందుకు పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లను నియమించనున్నారు. గతంలో పనిచేసిన విద్యా వాలంటీర్ల తరహాలోనే వీరు విధులు నిర్వర్తిస్తారు. మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా ఇంకా ఖాళీలున్న నేపథ్యంలో, మొత్తం 1,146 పోస్టులకు ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరికి స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు చొప్పున వేతనం అందించనున్నారు.

సంబంధిత పోస్ట్