AP: ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. మార్చి 2 నుంచి ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనను ఫాలొ కాకుంటే అకౌంట్లోకి ఉపాధి కూలీ డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు.