హోం మంత్రి అనిత చేతుల మీదుగా కానిస్టేబుల్ రామకోటికి ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు

అనకాపల్లి జిల్లా ఈగల్ బృందంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రామకోటిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో అభినందించి సత్కరించారు. ఇటీవల జూన్ 26న జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల నియంత్రణలో విశేష సేవలకు గాను రామకోటికి ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్