నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబ్ అంజుమ్ కు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్సై అంజుమ్ ను ప్రత్యేకంగా అలంకరించి, చేతికి గాజులు తొడిగి, పట్టు వస్త్రాలు అందజేశారు. గర్భిణి అయిన ఎస్సై ఆరోగ్య పరిస్థితిని హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.