అల్లూరి జిల్లా : పెద్ద పులి సంచారంపై అటవీశాఖ సూచనలు

అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య పొలం వద్దకు, అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. పులి జాడ తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, పులి దాడిలో పశు సంపదను కోల్పోతే తక్షణమే పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రజలు అటవీశాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్