అరకు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ: వైద్య సిబ్బందిపై ఆగ్రహం

అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం బుధవారం అరకులోయ మండలంలోని మాడగడ పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టికలో సంతకాలు అసంపూర్తిగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో మందుల లభ్యతను రికార్డుల ద్వారా పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సత్వర, మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యాధికారులను, సిబ్బందిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్