న్యూ ఇయర్ వేడుకలు.. అరకు సీఐ హెచ్చరికలు

న్యూ ఇయర్ వేడుకలను శాంతి భద్రతలు కాపాడుతూ, చట్టాలను గౌరవిస్తూ జరుపుకోవాలని అరకు CI హిమగిరి సూచించారు. అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ మండలాల్లో బుధవారం వాహన తనిఖీలు ఉంటాయన్నారు. డ్రంక్&డ్రైవ్, ర్యాస్ డ్రైవింగ్, హెల్మెట్,సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై, ప్రధాన కూడళ్లు,పబ్లిక్ ప్రదేశాలలో వేడుకలు జరపరాదన్నారు. అత్యవసర పరిస్థితిలో తమకి సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్