అక్కడ ఆర్టీసీ బస్సు నైట్ సేవలు బంద్

మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొన్ని ఆర్టీసీ నైట్‌ బస్సులను రద్దు చేసినట్లు విశాఖ డిపో డీఎం మాధురి తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 8 వరకు విశాఖ నుంచి సీలేరు మీదుగా నడిచే నైట్ సర్వీసులు, విశాఖ–సీలేరు నైట్ హాల్ట్‌, విశాఖ–భద్రాచలం, భద్రాచలం–విశాఖ నైట్ సర్వీసులను రద్దు చేశారు. పోలీసుల సూచనల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు డీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్