దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటిలోనే ఉందని, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ఆలయం పూర్తిగా నీట మునిగిందని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ బుధవారం తెలిపారు. అమ్మవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు, భక్తులు ఎవరూ దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.