చింతపల్లిలో గిరిజన రైతుల కోసం నిర్మించిన మార్కెట్ సంత షెడ్లు ఆకతాయిల అడ్డాగా మారి దయనీయ స్థితికి చేరాయి. పంచాయతీ, నాబార్డ్ నిధులతో నిర్మించిన ఈ షెడ్లు ప్రస్తుతం ఖాళీ మద్యం సీసాలు, చెత్తాచెదారంతో డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. ప్రతి బుధవారం జరిగే సంతకు వచ్చే రైతులు అసౌకర్యాల కారణంగా రహదారి పక్కనే వ్యాపారం చేస్తున్నారు. పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.