లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

చింతపల్లి–నర్సీపట్నం ప్రధాన రహదారిలోని లంబసింగి ఘాట్‌ వద్ద సోమవారం ఒక భారీ వాహనం నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్సై జీ. వీరబాబు, ఏఎస్సై నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, లారీని రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. లంబసింగి ఘాట్‌లో భారీ వాహనాలు తరచూ నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్