రాజవొమ్మంగి మండలంలో బుధవారం కూడా తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనసంచారం స్తంభించింది. జలాశయాల్లో నీరు చేరుతుండగా, వాగులు, గెడ్డలు పొంగిపొర్లే పరిస్థితి నెలకొంది. ప్రమాదకర వాగులను దాటవద్దని సీఐ సన్యాసినాయుడు ప్రజలకు సూచించారు. వాతంగి, గర్రంగి, కొత్తపల్లి, నెల్లిమెట్ల, శాంతినగర్, కిమ్మలగడ్డ, ఎర్రంపాడు గ్రామాల సమీపంలో వాగులను చూసుకొని రాకపోకలు సాగించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.