రంపచోడవరం పరిధిలోని గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో జూన్ 3, శుక్రవారం నాడు 'నెలకు ఒక గ్రామం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు అందిస్తే, అక్కడే ఉన్న జిల్లా, మండల స్థాయి అధికారులు తక్షణ చర్యలు చేపడతారని ఆయన పేర్కొన్నారు. గుర్తేడు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిర్యాదుతో పాటు ఆధార్ కార్డును జతచేయాలని సూచించారు.