పాపికొండల విహారయాత్రకు వినియోగిస్తున్న పర్యాటక బోట్ల తనిఖీ కోసం ప్రత్యేక కమిటీ త్వరలో దేవీపట్నానికి రానుంది. ఇటీవల గోదావరి నది మధ్యలో పర్యాటక బోట్లు నిలిచిపోవడంతో విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఐదు శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ మొత్తం 16 పర్యాటక బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది. బోట్ల భద్రత, సాంకేతిక ప్రమాణాలు, అవసరమైన అనుమతులను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌కు నివేదిక సమర్పించనుంది.