భారీ వర్షాల నైపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

రాజవొమ్మంగి మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని MEO–I కె. వి. వి. సత్యనారాయణదొర సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాలు, వాగులు, కాలువలు, వరద రహదారుల వద్దకు విద్యార్థులను అనుమతించవద్దని తెలిపారు. పాఠశాల భవనాలు, విద్యుత్ పరికరాలను తనిఖీ చేసి, వర్ష పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕