రాజవొమ్మంగి మండలం ఏ. వణకరాయి గ్రామంలో ఆపరేషన్ త్రిశూల్‌పై గురువారం రాత్రి జడ్డంగి ఎస్ఐ చినబాబు ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడొద్దని సూచించారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా నేరమని, సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.