వాటర్ ఫాల్ లా మారిన రహదారి

మారేడుమిల్లి మండలం పాములమామిడి గ్రామానికి వెళ్లే రోడ్డు వాటర్ ఫాల్ గా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై నుంచే నీరు పారుతుంది. దీంతో గ్రామస్థులు శనివారం రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. కనీసం 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని, రోడ్డుకు మరమ్మతులు చేయించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్