ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాజువాక నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగనుంద. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమ నేతలు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.