
బట్టతల ఉందని పెళ్లి క్యాన్సిల్.. డాక్టర్ ఆత్మహత్య
TG: హైదరాబాద్‌లోని అల్వాల్ బస్తీ ఆసుపత్రిలో పనిచేసే కిషోర్ అనే డాక్టర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన కిషోర్ (34)కు కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే అతడికి బట్టతల ఉందని యువతి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం రద్దు చేశారు. తర్వాత ఎన్ని సంబంధాలు చూసినా కిషోర్‌కు పెళ్లి కుదరకపోవడంతో మనస్థాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.