కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్దే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల లగేజీతో పాటు వారిని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.