రాజధాని నిర్మాణం ఆపాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని నిర్మాణం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఏపీని స్వచ్ఛంద్రగా మారుస్తున్నామని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నామని అన్నారు.