అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని, జూన్ 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.