సీతపాలెంలో బ్లూ జెట్ హెల్త్ పరిశ్రమ శంకుస్థాపనకు మంత్రి లోకేశ్ వచ్చిన సందర్భంగా పూడిమడక వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రికి వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్తున్న పూడిమడక మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. బ్లూ జెట్ ఫార్మా కంపెనీ ప్రమాదకరమని, APIIC బ్రాండిక్స్ పైపులైన్ వల్ల మత్స్య సంపద నశించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభ లేకుండానే కార్యక్రమం నిర్వహించడం సరికాదని మత్స్యకారులు నిరసన తెలిపారు.