నీరు రాని కొళాయికి పూలదండలు…

అనకాపల్లి జిల్లా రావికమ్మతం మండలం గర్నికం గ్రామ దళిత కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా మారింది. బోర్లు మరమ్మతు చేసి, కొత్త కొళాయి ఏర్పాటు చేసినా నీరు ఒక్కరోజు మాత్రమే వచ్చి ఆగిపోయింది. దీనికి నిరసనగా దళితులు డబ్బులతో ఊరేగింపు నిర్వహించి, నీరు రాని కొళాయికి పూలదండ వేసి వినూత్నంగా ఆందోళన చేశారు. తక్షణమే ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకుడు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్