రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జులై 1వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ వేడుకకు సంబంధించిన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తోంది.