గుత్తి: వార్డులో మౌలిక వసతులు కల్పించాలి

గుత్తి మున్సిపాలిటీలోని 10వ వార్డు బండగేరి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్కు జబ్బర్ మియాకు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు కృష్ణయ్య, లాల్ శేఖర్ మాట్లాడుతూ వార్డులో వీధిదీపాలు, డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్