రాష్ట్ర సి.ఐ.డి విభాగానికి బదిలీపై వెళ్తున్న అనంతపురం డిటిసి డీఎస్పీ సూర్యనారాయణరెడ్డిని అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తమ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి విభాగానికి మంచి సేవలు అందించారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా సి.ఐ.డి విభాగంలో మరింత మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.