హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి, నిధులు మంజూరు, ఇతర సమస్యల పరిష్కారాలు కోసం ఢిల్లీలో పార్లమెంట్ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నీ ఎంపీ అంబికా కలిశారు. అలాగే కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని, కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ని హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ తో కలిసి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు.