అనంత: పొగాకు ఉత్పత్తులపై కొనసాగుతోన్న పోలీసుల ప్రత్యేక డ్రైవ్

అనంతపురం జిల్లాలోని విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న వ్యాపార సముదాయాలు, బడ్డీలు, దుకాణాలు, టీ కేఫ్ లలో ఆయా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయితో తయారు చేసి అక్రమంగా విక్రయించే చాక్లెట్లు, చుట్టలుపై నిఘా వేసి లోతుగా చెక్ చేశారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2003 పొగాకు నియంత్రణ చట్టం (COTPA) నిబంధనల మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్