అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్రత ఉన్నవారిని చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. వైరల్ ఫీవర్‌కి చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక వారి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుందని డాక్టర్ తహర్నిశ తెలిపారు.