అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నీ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి తెల్లవారుజామున 5 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు గంటలపాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగిన ఆయన, ఎమర్జెన్సీ వార్డుతో పాటు గైనీ, ఆర్థో సహా అన్ని వార్డులను సందర్శించారు. ప్రతి రోగితోనూ, వారి అటెండర్లతోనూ ప్రత్యేకంగా మాట్లాడి, అందిస్తున్న చికిత్సల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే రాకతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్