రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ

రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో భారీ హెల్మెట్ బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ IPS ముఖ్య అతిథిగా పాల్గొని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసు పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని నడుపుతూ పాల్గొన్నారు. బుల్లితెర నటీమణులు కూడా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. రోడ్డు సేఫ్టీ మిషన్ లో సహకరించిన ప్రజలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా హెల్మెట్లు, ఖాకీ యూనిఫాంలు కూడా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్