జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రోడ్డు సేఫ్టీ మిషన్ లో భాగంగా రోడ్డు ఇంటర్వెన్షన్ & కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, NCC, NSS వాలంటీర్లు కలిసి రోడ్డు వినియోగదారులకు భద్రతపై అవగాహన కల్పించారు.