అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమానికి ఈరోజు 140 పిటిషన్లు అందాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, కుటుంబ కలహాలు, రస్తా వివాదాలు వంటి సమస్యలను నేరుగా విన్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా సమీక్షించి, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.