రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో అనంతపురం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుల్లితెర నటులతో కలిసి రోడ్డు భద్రతపై ఈరోజు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ సూచనల మేరకు, స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద నటులు సుస్మిత, ప్రభాకర్, పవన్ సాయి, అనిల్, శ్రీరాం తదితరులు రోడ్డు భద్రతా నిబంధనలు తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రదర్శనగా నడిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రజలకు సూచించారు.