బీర్లు తెగ తాగేస్తున్నారు..

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సత్యసాయి జిల్లాలో ఐఎంఎల్ 56 శాతం, బీర్ 94 శాతం వృద్ధితో రూ.768.03 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో ఐఎంఎల్ 33 శాతం, బీర్ 79 శాతం వృద్ధి నమోదు కావడంతో రూ.1207.01 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సత్యసాయి జిల్లాలో 34 శాతం, అనంతపురంలో 16 శాతం మేర విక్రయాల విలువ పెరిగింది.

సంబంధిత పోస్ట్