అనంతపురం నగరంలోని పీఏబీఆర్ డ్యామ్‌లో ట్రాన్స్ఫార్మర్ సమస్య కారణంగా మోటర్లు పనిచేయడం లేదు. దీంతో శుక్రవారం ఉదయం, సాయంత్రం నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించాలని నగర ప్రజలు సహకరించాలని గురువారం కోరారు.