ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 30వ వార్డు కౌన్సిలర్ రమాదేవి తన వార్డులో నాసిరకంగా రోడ్లు వేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రెండు నెలల్లోనే రోడ్లు పాడైపోయాయని, కంకర తేలి అద్వాన్నంగా తయారయ్యాయని ఆమె ఆరోపించారు. చైర్ పర్సన్ కాచెర్ల లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు.