ధర్మవరం: యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన మంత్రి

పాదయాత్రలో భాగంగా ధర్మవరంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి సత్య కుమార్ సందర్శించారు. కుక్కల నియంత్రణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధర్మవరంలో 3 వేల వరకు వీధి కుక్కలు ఉంటాయని, ప్రజల రక్షణ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల సేఫ్టీ కోసం, అలాగే పశు సంరక్షణను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్