ధర్మవరం నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని 25, 26, 27, 28 వార్డుల్లో ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ శుక్రవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.