పెట్రోల్ నిలువలపై ధర్మవరం తహసీల్దార్ వివరణ

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పెట్రోల్ కొరత లేదని ఇంచార్జ్ తహసీల్దార్ సురేష్ బాబు తెలిపారు. పెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. డీజిల్ సరఫరాలో మాత్రమే కొంత ఇబ్బంది ఏర్పడిందని, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కు కొరత లేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్