ధర్మవరం నూతన ఎంపీడీవో గా లలిత

ధర్మవరం మండల ఎంపీడీవోగా మంగళవారం ఎం. లలిత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈ పదవిలో ఉన్న సాయం మనోహర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ఎంపీడీవో లలిత మాట్లాడుతూ, మండలంలోని 20 గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నూతన ఎంపీడీవోను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్