ముదిగుబ్బ తహశీల్దార్ గా మహేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమడగూరు ప్రొవిజనల్ డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న ఆయనకు కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ తహశీల్దార్ నారాయణస్వామి, సీఎస్జీటీ మునిస్వామి, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండలంలో జరుగుతున్న రీ సర్వే, ఇతర పనుల పురోగతిని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.