గుంతకల్లు బస్టాండ్ సమీపంలో సీఐటీయూ భగత్ సింగ్ ఆటో యూనియన్ బోర్డును టూ టౌన్ ఎస్సై సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో కార్మికులకు క్రమశిక్షణ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.