గుంతకల్లు నియోజకవర్గ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గుంతకల్లు రైల్వే DRM కార్యాలయంలో రైల్వే GM మరియు DRM లను మర్యాదపూర్వకంగా కలిసి, కసాపురం బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, హనుమాన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎత్తు పెంచాలని కోరారు. తద్వారా గుంతకల్లు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.