గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కార ప్రక్రియను అడిగి తెలుసుకుని, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు.