జిల్లా కలెక్టర్ ఆనంద్: గుత్తి కోట రహదారి పరిశీలన

గుత్తి మండలం కొత్తపేట వద్ద జాతీయ రహదారులు 44, 67 కలిసే చోటు నుంచి గుత్తి కోటకు వెళ్లే రహదారిని జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్, ఐఏఎస్ పరిశీలించారు. గుర్రపుశాల వద్ద కనెక్టివిటీని కూడా ఆయన పరిశీలించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, హంపి వంటి నగరాల నుండి ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారుల గుండా వెళ్తుంటాయి. వాహనదారులకు విశ్రాంతి తీసుకోవడానికి, గుత్తి కోట పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వీలుగా, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న అనువైన ప్రదేశాలను, కోటకు దగ్గరగా ఉండే రహదారిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుత్తి తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, గ్రామ సర్పంచ్ మస్తాన్, మండల సర్వేయర్, vroలు, vraలు, రెవిన్యూ సిబ్బంది, మునిసిపల్ సర్వేయర్, మునిసిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్