నీటి సమస్య రానీయకండి : ఎమ్మెల్యే

ప్రస్తుత వేసవి కాలంలో పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధికారులను ఆదేశించారు. స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం ప్రత్యేక అధికారి కేశవనా యుడు అధ్యక్షతన అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి సమస్య ఉన్న వార్డులలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం పదవి కాలం ముగిసిన సర్పంచు లను ఎమ్మెల్యే శాలువ, పూలమాలతో సత్కరించారు. ఎన్టీఆర్‌ చిత్ర పటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ హేమచంద్ర, మేనేజర్‌ రాంబాబు, శానిటరీ ఇన్సిపెక్టర్‌ మహబుబ్‌ బాషా, మార్కెట్‌ యార్డు చైర్మన సూర్యప్రతాప్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, చికెన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్