గుత్తి మండలం బసినిపల్లి, గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు మండలంలోని 24 గ్రామపంచాయతీలో శుక్రవారం ఉదయం నుంచి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. టీడీపీ కూటమి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి నగదు అందజేశారు. వారు మాట్లాడుతూ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.