లేపాక్షి విశ్రాంత ఎంపీడీవోపై అవినీతి విచారణ

లేపాక్షి విశ్రాంత ఎంపీడీవో నరసింహమూర్తిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో పెనుగొండ డీడీఓ రామకృష్ణ బుధవారం విచారణ చేపట్టారు. మండల నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో, జెడ్పీ సీఈఓ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ఎంపీడీవో కార్యాలయంలోని రికార్డులను డీడీఓ ఆమూలాగ్రంగా పరిశీలించి, పూర్తి నివేదికను సీఈఓకు అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్